ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసులు నిన్న బుధవారం ఛార్జ్ షీట్ దాఖలు చేసారు. లేడీ కొరియాగ్రాఫర్ ని మోసం చేసిన కేసులో జానీ మాస్టర్ నెలన్నరకు పైగానే జైలు జీవితం గడిపి బెయిల్ పై ఇంటికొచ్చారు. ఇంతలోపులో జానీ మాస్టర్ ఆ లేడీ కోరిగ్రాఫర్ ని ఈవెంట్స్ పేరు చెప్పి దూర ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగికంగా వేధించినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు.
దానితో జానీ మాస్టర్ పై ఛార్జ్ షీట్ వెయ్యగా ఈ ఛార్జ్ షీట్ పై జానీ మాస్టర్ స్పందించారు. తాను ఏ తప్పు చెయ్యలేదు అనే విషయం తన అంతరాత్మకు తెలుసు, తనకి తెలుసు, ఆ దేవుడికి తెలుసు, ప్రస్తుతం తాను తన పని చేసుకుంటున్నాను, తాను ఎలాంటి తప్పు చెయ్యలేదు అని నిరూపించుకుంటాను, తనకి శిక్ష పడలేదు, తాను నేరస్తుడిని కాదు అంటూ జానీ మాస్టర్ వీడియో షేర్ చేసారు.
అయితే తన అంతరాత్మకు తెలుసు అంటూ జానీ మాస్టర్ మాట్లాడిన మాటలు చూసి కోర్టుకు సాక్ష్యాలు చాలు, అంతరాత్మ చెప్పింది అంటే కోర్టు వినదు జానీ అంటూ జాని మాస్టర్ వీడియో పై నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.