Advertisementt

బలగం వేణు హీరోయిన్ సాయి పల్లవి

Wed 25th Dec 2024 10:33 PM
sai pallavi  బలగం వేణు హీరోయిన్ సాయి పల్లవి
Balagam Venu heroine Sai Pallavi బలగం వేణు హీరోయిన్ సాయి పల్లవి
Advertisement
Ads by CJ

బలగం చిత్రం చేసాక మీడియం రేంజ్ హీరో కోసం దర్శకుడు వేణు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాడు. బలగం చిత్రం సూపర్ సక్సెస్ అవడంతో వేణుతో రెండో సినిమా సినిమా చెయ్యడానికి ఖచ్చితంగా మీడియం రేంజ్ హీరో వస్తారని అనుకున్నారు, వేణు కూడా ఆ దిశగానే ప్రయత్నాలు చేసాడు. ఎల్లమ్మ అంటూ కొత్త కాన్సెప్ట్ తో హీరో నాని తో రెండో చిత్రాన్ని లాక్ చేసుకున్నాడు. 

కానీ నాని ఎల్లమ్మ ప్రాజెక్ నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి హీరో నితిన్ వచ్చి చేరాడు. దిల్ రాజు దర్శకత్వంలో వేణు-నితిన్ కాంబో త్వరలోనే పట్టాలెక్కేందుకు రెడీ అవుతుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ విషయంలో ఎవరు పెద్దగా ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. తాజాగా ఎల్లమ్మ చిత్రం కోసం ఓ క్రేజీ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాక్ మొదలైంది. 

ఆమె నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, ఎల్లమ్మ చిత్రంలో కథానాయకి పాత్ర కి చాలా ప్రాముఖ్యత ఉండడం, కథ కూడా నచ్చడంతో సాయి పల్లవి వేణు ఎల్లమ్మ ప్రాజెక్ట్ ని ఓకె చేసినట్లుగా తెలుస్తుంది. తండేల్ విడుదల తర్వాత సాయి పల్లవి-నితిన్ జంటగా దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రాన్ని వేణు సెట్స్ మీదకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడట. 

Balagam Venu heroine Sai Pallavi:

Sai Pallavi Gives Green Signal To Yellamma Story With Balagam Venu

Tags:   SAI PALLAVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ