లేడీ కొరియాగ్రాఫర్ ని లైంగికంగా వేధించిన కేసులో కొద్దిరోజులు జైలులో ఉండి ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న జానీ మాస్టర్ పై ప్రస్తుతం చార్జ్ షీట్ దాఖలు చేసారు నార్సింగ్ పోలీసులు. లేడీ కొరియాగ్రాఫర్ ని జానీ మాస్టర్ వేధించడమే కాదు, ఈవెంట్ పేర్లతో పలు ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాలుపడినట్లు పోలీసుల నిర్ధారణ చెయ్యడంతో జానీ మాస్టర్ పై చార్జ్ షీట్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది.
దానితో జానీ మాస్టర్ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. గతంలో లేడీ కొరియాగ్రఫర్ వేధింపుల విషయంలో కంప్లైంట్ చెయ్యగా జానీ మాస్టర్ పై కేసు నమోదు అయ్యింది. ఆయన దాదాపుగా నెలన్నర పైనే జైలులలో ఉన్నారు. ఈకేసులో ఆయనకు బెయిల్ లభించడంతో చంచల్ గూడా జైలు నుంచి అక్టోబర్ నెలాఖరున విడుదలయ్యారు. ఇప్పుడు మరోమారు ఆయన జైలుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి.