Advertisementt

డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ పై వంశీ నమ్మకం

Wed 25th Dec 2024 12:12 PM
naga vamsi  డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ పై వంశీ నమ్మకం
Vamsi believes in Daku Maharaj director Bobby డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ పై వంశీ నమ్మకం
Advertisement
Ads by CJ

నిర్మాత నాగవంశీ డాకు మహారాజ్ పై పెంచుకున్న నమ్మకం, దర్శకుడు బాబీ పై చూపిస్తున్న కాన్ఫిడెన్స్ చూస్తే నందమూరి అభిమానులలో అంచనాలు పెరిగిపోతున్నాయి. డాకు మహారాజ్ కు ముందు బాబీ తీసిన చిత్రాలు అంటే ఆయన వాల్తేర్ వీరయ్య వరకు తెరకెక్కించిన చిత్రాలు ఒక ఎత్తు, ఆతర్వాత డాకు మహారాజ్ ఒక ఎత్తు అంటూ నిర్మాత నాగవంశీ పదే పదే చెప్పడం ఆ చిత్రం పై అంచనాలు పెంచేస్తుంది. 

బాబీ కెరీర్ లో పవర్, జై లవ కుశ, వాల్తేర్ వీరయ్య లాంటి చిత్రాలు మంచి హిట్స్. మరి అంతకు మించి అనేలా డాకు మహారాజ్ చిత్రం ఉంటుంది, అదిరిపోయే యాక్షన్, అందుకు తగ్గ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ అన్ని ఉంటాయి. అభిమానులకే కాదు అందరూ మెచ్చేలా డాకు మహారాజ్ ఉంటుంది, రాసిపెట్టుకోండి అంటూ నాగవంశీ చెబుతున్నాడు. 

మరి దర్శకుడు బాబు డాకు మహారాజ్ ని వేరే లెవల్లో తెరకెక్కించాడు అంటూ బాబీ పై నిర్మాత నాగవంశీ చాలా నమ్మకమే పెట్టుకున్నాడు. బాబీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో లేదో అనేది ఈ సంక్రాంతికి తేలిపోతుంది. ఎందుకంటే డాకు మహారాజ్ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది గనక. 

Vamsi believes in Daku Maharaj director Bobby:

Producer Naga Vamsi believes in Daku Maharaj director Bobby

Tags:   NAGA VAMSI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ