పుష్ప పార్ట్ 1 తో ఎలాంటి అంచనాలు లేకుండా హిందీ మర్కెట్ లో 100 కోట్లు కొల్లగొట్టిన పుష్ప రాజ్ అదేనండి అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 తో ఏకంగా 700కోట్లు కలెక్షన్స్ రాబట్టి అసలు సిసలు రికార్డ్ నెలకొల్పాడు. పాన్ ఇండియా మార్కెట్ లోను అందులోను నార్త్ మార్కెట్ లో పుష్ప 2 పై విపరీతమైన క్రేజ్ కనిపించింది.
అందుకుతగ్గ కంటెంట్ కనిపించడంతో మరోసారి నార్త్ ఆడియన్స్ పుష్ప ద రూల్ కనెక్ట్ అయ్యి బ్రహ్మరధం పట్టారు. ప్రీమియర్స్ నుంచే పుష్ప 2 బాలీవుడ్ లో హవా చూపించడం మొదలు పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అంతకు మించి అనేలా పుష్ప 2 హిందీ కలెక్షన్స్ ఉండడం, అలాగే ఇప్పటివరకు పదిలంగా ఉన్న బాహుబలి రికార్డులను పుష్ప తుడిచెయ్యడం అల్లు ఫ్యాన్స్ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా చేసింది.
ప్రమోషన్స్ కి ప్లానింగ్ అక్కర్లేదు అంటూ అల్లు అర్జున్ తన హీరోయిన్ రష్మిక, ప్రొడ్యూసర్స్ తో కలిసి పుష్ప 2ని ప్రమోట్ చెయ్యడం, పుష్ప 1 పై నార్త్ ఆడియన్స్ పెట్టిన నమ్మకాన్ని పుష్ప 2 నిలబెట్టుకోవడంతో అక్కడ పుష్ప కలక్షన్స్ తో ఊచకోత కోసింది. మూడు వారాలు పూర్తి కాకుండానే నార్త్ మార్కెట్లో పుష్ప రాజ్ 700 కోట్లతో విజయకేతనం ఎగురవేశాడు.