పుష్ప 2 ద రూల్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు సుకుమార్ ఇకపై సినిమాలు చెయ్యరా? ఆయన ఎందుకు సినిమాలు వదిలేస్తాను అంటూ ఆన్సర్ ఇచ్చారు అని సుక్కు అభిమానులు తెగ మధనపడిపోతున్నారు. అసలు సుక్కు సినిమాలు వదిలేస్తాను అని ఎందుకు ఎక్కడ చెప్పారో తెలుసా..
పుష్ప ద రూల్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో సుకుమార్ లాంగ్ బ్రేక్ తీసుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు. ఆయన హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లారు. అక్కడ గేమ్ చెంజర్ ఈవెంట్ లో పాల్గొన్న సుకుమార్ ను యాంకర్ సుమ.. మీరు డోప్ అని సడెన్‌గా ఈరోజుతో ఏదైనా ఒకటి వదిలేయాలనుకుంటే ఏం వదిలేస్తారు అని అడిగింది.
దానికి సుకుమార్ సడన్ గా సినిమా అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. దానితో అక్కడే ఉన్న రామ్ చరణ్, బుచ్చిబాబు, ఫ్యాన్స్ అంతా అవాక్కయ్యారు. వెంటనే రామ్ చరణ్ మైక్ అందుకుని 10 ఏళ్లుగా ఇలానే భయపెట్టిస్తున్నారండి.. అలా ఏం జరగదు అంటూ చెప్పాడంతో సుకుమార్ చిన్నగా నవ్వి ఊరుకున్నారు.
సినిమాలంటే ప్రాణం పెట్టి పనిచేసే సుకుమార్ ఇలాంటి ఆన్సర్ ఎందుకు ఇచ్చారు అంటూ అందరూ తెగ చర్చించేసుకుంటారు.