బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న మిల్కి బ్యూటీ తమన్నా పెళ్లి విషయం పక్కనపెట్టి కెరీర్ లో ఇంకా ఇంకా బిజీ అయ్యేందుకు ప్రయత్నం చేస్తుంది. సౌత్ లో ఓదెల 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న తమన్నా బాలీవుడ్ లో మాత్రం అవకాశాల కోసం విపరీతమైన గ్లామర్ షో చేస్తుంది.
అందాలు ఆరబోస్తూ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న తమన్నా తన బర్త్ డే ఇంకా క్రిష్టమస్ అలాగే న్యూ ఇయర్ వేడుకల కోసం గోవాకి చెక్కేసింది. విజయ్ వర్మతో ఇంకా ఫ్రెండ్స్ తో కలిసి తమన్నా వెకేషన్స్ ఎంజాయ్ చెయ్యడానికి గోవాకి వెళ్ళింది. అక్కడే ఈ వారం తమన్నా-విజయ్ వర్మ కలిసి సెలెబ్రేట్ చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.
గోవాలో ఫ్రెండ్స్, విజయ్ వర్మతో కలిసి వీడియో గేమ్ ఆడుతున్న ఫొటోస్ ని తమన్నా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే తమన్నా-విజయ్ వర్మలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత ఏడాది కాలంగా ప్రచారం జరుగుతున్నా ఈ జంట మాత్రం పెళ్లి పేరు ఎత్తకుండానే ఎంజాయ్ చేస్తున్నారు.