Advertisementt

వెంకీ ఓకె.. మరి చిరునో..

Tue 24th Dec 2024 10:39 AM
venkatesh  వెంకీ ఓకె.. మరి చిరునో..
Chiranjeevi came to Unstoppable వెంకీ ఓకె.. మరి చిరునో..
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో కి సంక్రాంతి స్పెషల్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ వచ్చారు. గత ఆదివారమే వెంకటేష్ తో బాలయ్య ఆహా అన్ స్టాపబుల్ అంటూ ఆడించారు. ఈ ఆదివారం గేమ్ ఛేంజర్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ NBK టాక్ షో కి  హాజరవ్వబోతున్నారు. 

రామ్ చరణ్, శంకర్, దిల్ రాజులు ఈ వారం ఆహా బాలయ్య షోకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం వెంకిమామ - బాలయ్య అన్ స్టాపబుల్ షోకి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అది చూసిన వారు వెంకీ ఓకె మరి చిరునో అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో లో ఇది నాలుగో సీజన్ నడుస్తుంది. 

ఇన్ని సీజన్స్ పూర్తవుతున్నా అల్లు అరవింద్ మెగాస్టార్ ని బాలయ్య షోకి తీసుకురాకపోవడం నిజంగా ఆశ్చర్యమే. బాలయ్య-చిరు కలిసి టాక్ షోలో కనిపించాలని నందమూరి-మెగా అభిమానులే కాదు సినీ లవర్స్ అందరూ కోరుకుంటున్నారు. మరి ఆ ముచ్చట ఎప్పటికి తీరుతుందో అనేది అందరిలో నడుస్తున్న సస్పెన్స్.  

అరవింద్ తలచుకుంటే అదేమంత పెద్ద విషయం కాదు. మరి మెగాస్టార్-నటసింహాలు కలిసి ఆడబోయే షో కోసం, వారి కలయిక కోసం అందరూ వెయిటింగ్. 

Chiranjeevi came to Unstoppable:

Venkatesh and Balakrishna Fun Moments at Unstoppable show

Tags:   VENKATESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ