అల్లు అర్జున్ vs తెలంగాణ ప్రభుత్వం విషయంలో మెగాస్టార్ మౌనం వీడాల్సిందే అంటున్నారు పెద్దలు. అల్లు అర్జున్ పైకి రేవంత్ రెడ్డి ఒంటికాలుతో కాదు నాలుగు కాళ్ళతో వెళుతున్నారు. రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ మంత్రులంతా అల్లు అర్జున్ విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. అటు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ ప్రభుత్వం పై ఇండైరెక్ట్ గా స్పందించడం, ఈమద్యలో పోలీస్ లు ప్రెస్ మీట్ పెట్టి సినిమా ఇండస్ట్రీపై కామెంట్స్ చెయ్యడం..
ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని అక్కడికి ఆహ్వానించడం, నిర్మాత నాగవంశీ మాత్రం మేము ఇల్లు ఇక్కడే కట్టుకున్నాం, అక్కడికి ఎలా వెళ్తామనడం ఇలా ఎవరికి తోచినట్లుగా వారు స్పందిస్తూ అందరిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అసలు రేవంత్-అల్లు అర్జున్ వ్యవహారం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో అని అందరూ సీరియస్ గా వెయిట్ చేస్తున్నారు.
అయితే ఈ ఇష్యు సర్దుమణగాలంటే మెగాస్టార్ రంగంలోకి దిగాలి, చిరు రేవంత్ ప్రభుత్వంతో భేటీ అయ్యి సమస్యను పరిష్కరించాలి, ఆయన ఇండస్ట్రీ పెద్దగా ముందుండి ఈ సమస్యని చక్కదిద్దాలంటూ సినీప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు. ఈ వ్యవహారంలో మెగాస్టార్ మౌనం వీడాలంటున్నారు. మరి చిరు ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి.