సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో మహిళ రేవతి మృతి చెందడం, ఆమె కొడుకు శ్రీతేజ్ ఆసుపత్రిలో సీరియస్ కండిషన్ లో ఉండడం అన్ని పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ను సమస్యల్లో పడేసాయి. అదే కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్న అల్లు అర్జున్ కి కోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
ఇప్పుడు సంధ్య థియేటర్ తొక్కిసాటలో అల్లు అర్జున్ కి చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు, రేపు ఉదయం11 గంటలకు హాజరు కావాలని అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. మరి అల్లు అర్జున్ విచారణకు హాజరవుతారా, లేదా అనేది తెలియాల్సి ఉంది.