మంచు మోహన్ బాబు కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నేడు సోమవారం తెలంగాణ హై కోర్టు నిరాకరించడం, రేపు మోహన్ బాబు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీడియాలో వార్తలు వస్తున్న సమయంలోనే మరోసారి మంచు వారి రచ్చ మీడియా కెక్కింది. రీసెంట్ గా మంచు విష్ణు పై ఎలాంటి పోస్ట్ పెట్టిన చర్యలు తీసుకుంటామని కోర్టు మనోజ్ కి వార్నింగ్ ఇచ్చింది.
ప్రస్తుతం అన్నదమ్ముల నడుమ అంతా నార్మల్ గానే కనిపించినా మరోసారి మంచు వారి మంట మీడియాలో వైరల్ అయ్యింది. ఈ రోజు మంచు మనోజ్ అన్న విష్ణు తో పాటు వినయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. 7 అంశాల మీద మంచు విష్ణు పై మనోజ్ ఫిర్యాదు చేసాడు.
తన అన్న మంచు విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఏడు పేజీల ఫిర్యాదుని మనోజ్ పోలీసులకు పంపించడం హాట్ టాపిక్ అయ్యింది.