Advertisementt

సోనియా పెళ్ళికి వెళ్ళని BB8 విన్నర్ నిఖిల్

Mon 23rd Dec 2024 03:40 PM
sonia akula  సోనియా పెళ్ళికి వెళ్ళని BB8 విన్నర్ నిఖిల్
BB8 winner Nikhil who did not go to Sonia Akula wedding సోనియా పెళ్ళికి వెళ్ళని BB8 విన్నర్ నిఖిల్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ 8 లో మొదటి నాలుగు వారాల్లో పెద్దోడు చిన్నోడు అంటూ సోనియా ఆకుల నిఖిల్-పృథ్వీ లను తన వెంట తిప్పుకోవడమే కాదు, వారితో ఆమె సాన్నిహిత్యంగా ఉంటూ ముద్దులు అవి పెట్టుకోవడంతో సోనియా ఆకుల-నిఖిల్ మధ్యలో లవ్ ఉన్నట్లుగా ప్రేక్షకులు డిసైడ్ అయ్యారు. దానితో సోనియా బిహేవియర్ నచ్చని ప్రేక్షకులు ఆమెను నాలుగు వారాల్లోనే ఇంటికి పంపించేశారు. 

ఆతర్వాత సోనియా బిగ్ బాస్ పై సన్సెషనల్ కామెంట్స్ చేసింది. హౌస్ లో నిఖిల్ తో డీప్ ఫ్రెండ్ షిప్ చేసిన సోనియా ఆ తర్వాత అంటే చివరి నామినేషన్స్ సమయంలో హౌస్ లోకి వచ్చి అనూహ్యంగా నిఖిల్ ని నామినేట్ చెయ్యడమే కాదు, అతనిపై చాలా అలిగేషన్స్ చేసింది అంతేకాదు బయట కూడా నిఖిల్ పై నెగెటివ్ పోస్ట్ లు పెట్టింది. 

ఇక బిగ్ బాస్ విన్నర్ అయ్యాక నిఖిల్ తో, పృథ్వీ తో ఫొటోస్ దిగిన సోనియా పాత గొడవలు మర్చిపోయింది అనుకున్నారు. ఈ నెల 20 న సోనియా ఆకుల-యష్ ల రిసెప్షన్ కి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మొత్తం హాజరయ్యారు. తేజ, రోహిణి, ప్రేరణ ఇలా అందరూ రిసెప్షన్స్ లో సందడి చేసారు. కానీ సోనియా ఫ్రెండ్  బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ మాత్రం సోనియా పెళ్లిలో కనిపించలేదు. 

దానితో అందరూ షాకవుతున్నారు. ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూ సోనియా చుట్టూ తిరిగిన నిఖిల్ సోనియా ఆకుల పెళ్ళిలో కనిపించకపోవడమే అందరికి షాకిచ్చే విషయం. 

BB8 winner Nikhil who did not go to Sonia Akula wedding:

Sonia Akula Yash Veeragoni Marriage

Tags:   SONIA AKULA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ