రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ సారి చెప్పాలంటూ ఆయన ఇంటిపై కొంతమంది స్టూడెంట్స్, రాళ్లు, టమాటాలు విసరడం హాట్ టాపిక్ అయ్యింది. రేవతి చావు కు కారణం అల్లు అర్జున్ అంటూ OU జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు, నినాదాలు చేస్తూ అల్లు అర్జున్ ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం చెయ్యడమే కాదు అక్కడ ఉన్న పూల కుండీలను పగలగొట్టారు.
చనిపోయిన మహిళ రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ కోటి రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేసారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటిపై స్టూడెంట్స్ దాడికి దిగిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దాంతో రంగంలోకి దిగిన పోలీసులు స్టూడెంట్స్ ని అరెస్ట్ చేసారు. అయితే మహిళా చనిపోయిన 15 రోజులకి ఇప్పుడు సడెన్ గా ఇలా దాడి చేయడం పలు అనుమానాలకు దారి తీస్తుంది.