సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట అల్లు అర్జున్ మెడకు చుట్టుకుంది. A 11 గా ఉన్న అల్లు అర్జున్ ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయించడం మాత్రమే కాదు, అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి నుంచి తెలంగాణ మినిస్టర్స్ చాలామంది ఫైర్ అవుతున్నారు. అల్లు అర్జున్ జైలు నుంచి రాగానే సినీ ప్రముఖులు ఆయన్ని పరామర్శించడంపై తెలంగాణ మినిస్టర్స్ మాత్రమే కాదు నెటిజెన్స్ కూడా విమర్శలకు దిగారు.
ఇప్పుడు ఈ వివాదంలోకి మెగాస్టార్ ను లాగుతున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన మెగాస్టార్ అక్కడ హాస్పిటల్ లో ఉన్న శ్రీతేజ్ ని ఎందుకు పరామర్శించలేదు అంటూ తెలంగాణ మినిస్టర్ కోమటిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు అల్లు అర్జున్ ఇంటికెళ్లిన వారికి కోమటి రెడ్డీ సూటి ప్రశ్న వేస్తున్నారు.
హాస్పిటల్లో ఉన్న శ్రీతేజను చిరంజీవి ఎందుకు పరామర్శించట్లేదు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం ఇలాగే మానవత్వం లేకుండా ఉంటారా అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ చూసి ఈ వివాదంలోకి చిరు ని కూడా లాగుతున్నారంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.