Advertisementt

నెగెటివ్ పోస్టులు పెట్టేవారికి బన్నీ వార్నింగ్

Sun 22nd Dec 2024 04:12 PM
allu arjun  నెగెటివ్ పోస్టులు పెట్టేవారికి బన్నీ వార్నింగ్
Allu Arjun warns those who post negative posts నెగెటివ్ పోస్టులు పెట్టేవారికి బన్నీ వార్నింగ్
Advertisement
Ads by CJ

సంధ్య థియేటర్ సంఘటన దగ్గర నుంచి అల్లు అర్జున్ పై ఓ వర్గం వారు నెగెటివ్ గా స్పందిస్తున్నారు. అసలు అల్లు అర్జున్ అంత జనం మధ్యలో థియేటర్ కి వెళ్లి సినిమా ఎందుకు చూసాడు, అంత పబ్లిసిటి పిచ్చెమిటి అల్లు అర్జున్ కి, మహిళ చనిపోయింది అని తెలిసినా అతను మూవీ థియేటర్ లోనే ఉన్నాడు.  

అంతేకాదు జైలు కెళ్లొచ్చాక తనని పరామర్శించడానికి వచ్చే వారిని రావొద్దు అని చెప్పలేదు. మీడియాతో లైవ్ పెట్టించుకున్నాడు, ఇక అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై కామెంట్స్ చేస్తే దానికి రియాక్ట్ అవుతూ ప్రెస్ మీట్ పెట్టడం తప్పు అంటూ రకాకలుగా అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు. అది చూసిన అల్లు అర్జున్ తనపై నెగెటివ్ పోస్ట్ లు పెట్టేవారికి వార్నింగ్ ఇచ్చాడు. 

నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచేలా పోస్ట్ లు వేయవద్దని విన్నపం, ఫ్యాన్స్ ముసుగులో కొద్దిరోజులుగా ఫేక్ ID, ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్ట్ లు పెడుతున్నారు, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. నెగెటివ్ పోస్ట్ లు పెట్టేవారికి నా ఫ్యాన్స్ దూరంగా ఉండాలని కోరుతున్నాను అంటూ ప్రెస్ నోట్ ని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. 

Allu Arjun warns those who post negative posts:

Allu Arjun urges fans to express feelings responsibly

Tags:   ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ