అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది టిల్లు స్క్వేర్ హిట్ తర్వాత బాగా వినిపించిన పేరు. టిల్లు స్క్వేర్ తర్వాత వరస ఆఫర్స్ తో బిజీగా మారిపోయి అనుపమ పరమేశ్వరన్ వచ్చే ఏడాది రెండు మూడు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించబోతుంది. టిల్లు స్క్వేర్ తర్వాత గ్లామర్ అవతారమెత్తిన ఈ లిల్లీకి యంగ్ హీరోలు పడిపోయారు.
ఇక సోషల్ మీడియాలో ఎపుడు యాక్టీవ్ గా ఉండే అనుపమ పరమేశ్వరన్ ఈమధ్యన సోషల్ మీడియాలో కనిపించి చాలా రోజులైంది. తాజాగా ఆమె ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న పిక్స్ షేర్ చేసింది. ప్రకృతి ఎంత ముద్దుగా అందంగా ఉంటుందో.. అందుకు రెట్టింపు అందంతో అనుపమ పరమేశ్వరన్ కనిపించింది.
అనుపమ టాప్ లో క్యూట్ గా చాలా సింపుల్ గా కనిపించింది. మొక్కల మధ్యలో అనుపమ ప్రకృతి అందాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.