నిజంగా సినీ హీరోలను వారి అభిమానులు దేవుడి కన్నా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. పాన్ ఇండియా స్టార్స్, స్టార్ హీరోలు ఇలా ఎవరికి వారే సపరేట్ గా ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఒక్కోసారి ఆ అభిమానం హద్దులు దాటి పోతుంది. అందులో భాగమే బ్యానర్ కట్టేటప్పుడు కరెంట్ షాక్స్ తగలడం, ఈవెంట్స్ అప్పుడు తొక్కిసలాటలు, అందులో ప్రాణాలు పోవడం ఇవన్నీ ఇప్పటివి కావు. ఎన్టీఆర్-ఏఎన్నార్ టైమ్ నుంచే ఉన్నాయి. ఇక ఆ అభిమానులు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఇలా ఏ భాషకైనా ఒక్కటే అభిమానం కనిపిస్తుంది. అది అమలాపురమైనా, అమెరికా అయినా అభిమానం మాత్రం ఒకటే సుమీ అన్నట్టుగా ఉన్నారు ఆయా హీరోల అభిమానులు. ఇక ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోల సినిమా ఈవెంట్స్ కి అంతగా అభిమానం చూపిస్తూ హీరో కోసం ఆ ఈవెంట్ కి పరుగులు పెడతారో అదే అభిమానం అమెరికాలోను చూపిస్తున్నారు.
రంగస్థలం, ఆర్.ఆర్.ఆర్ తర్వాత గ్లోబల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తో జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అమెరికా డల్లాస్ పురంలో గేమ్ ఛేంజర్ ఈవెంట్ ప్లాన్ చేసారు మేకర్స్. మరి ఇక్కడ చరణ్ కోసం ఎంతగా అభిమానం చూపిస్తూ ఈవెంట్స్ కి వస్తారో అమెరికా డల్లాస్ పురంలోను రామ్ చరణ్ కోసం అంతగా అభిమానులు హాజరయ్యారు.
ఆ ఈవెంట్ లో చరణ్ పై అభిమానం చూపించే వారిని చూసి ఇది అమెరికానా లేదంటే అమలాపురమా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి అభిమానానికి అమెరికా అయినా ఒకటే, అమలాపురమైన ఒకటే కదా.