కోలీవుడ్ స్టార్ కపుల్ జయం రవి-ఆర్తి లు విడాకులు తీసుకోబోతున్నట్టుగా జయం రవి ప్రకటించినా ఆయన భార్య ఆర్తి మాత్రం కలిసి ఉండాలనే కోరికని సోషల్ మీడియాలో ఎక్స్ ప్రెస్ చేసింది. కానీ జయం రవి మాత్రం తాను తన భార్యతో విడిపోవడానికే మొగ్గు చూపారు. వీరి విడాకుల కేసు ప్రస్తుతం చెన్నై ఫ్యామిలీ కోర్టులో ఉంది.
తాజాగా చెన్నై కోర్టు జయం రవి-ఆర్తి ల విడాకుల కేసులో వారికి ఓ సలహా ఇచ్చింది. వారిద్దరిని రాజి పడాలని, కలిసి కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. అయితే జయం రవి-ఆర్తిలకు కోర్టు సూచన పెద్దగా ఎక్కలేదనే చెప్పాలి. కోర్టు సూచనలమేరకు కలిసి కూర్చుని మాట్లాడుకున్నా సమస్య పరిష్కారం అవ్వలేదు అని ఇరు వర్గాల లాయర్లు కోర్టుకి తెలిపినట్లుగా తెలుస్తోంది.
దానితో కోర్టు ఈ విడాకుల విచారణను వాయిదా వేసింది. వాయిదాలోపు మరోసారి జయం రవి-ఆర్తి కలుసుకుని మాట్లాడుకోవాలని కోర్టు ఈ స్టార్ కపుల్ కి సలహా ఇచ్చింది.