Advertisementt

రేవంత్ రెడ్డి కామెంట్స్-అల్లు అర్జున్ రియాక్షన్

Sat 21st Dec 2024 08:46 PM
revanth reddy  రేవంత్ రెడ్డి కామెంట్స్-అల్లు అర్జున్ రియాక్షన్
Allu Arjun Press Meet highlights రేవంత్ రెడ్డి కామెంట్స్-అల్లు అర్జున్ రియాక్షన్
Advertisement
Ads by CJ

రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ కి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ రియాక్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఒక దురదృష్టకర ప్రమాదమని, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను, ఘటనలో ఎవరి తప్పూ లేదు, శ్రీతేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను, ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు తాను ప్రెస్మీట్ పెట్టలేదని, తన వ్యక్తిత్వం గురించి దుష్ప్రచారం చేస్తుండటం బాధిస్తోందని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. 

అల్లు అర్జున్ ప్రెస్ మీట్ హైలైట్స్ 

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరం.. ఇది ఒక యాక్సిడెంట్. 

ఇందులో ఎవరిది తప్పులేదు.. అంతా మంచి జరగాలనుకున్నా, అనుకోని ప్రమాదం జరిగింది. 

ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం.. ఈ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నా

సినిమాకు వచ్చేవారిని ఎంటర్‌టైన్‌ చేయాలనుకుంటాను.. శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా. 

శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది..శ్రీతేజ్ కోలుకోవాలని కోరుకుంటున్నా.. నేను ఎవరిని దూషించదలుచుకోలేదు. 

20 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు కదా.. నేను ఎవరినైనా ఏమైనా అంటానా

నాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు బాధ కలిగిస్తున్నాయి..మూడేళ్లు కష్టపడ్డ సినిమా ఎలా ఉందో చూద్దామని థియేటర్‌కు వెళ్లాను. 

నేను పోలీసుల డైరెక్షన్‌లో వెళ్లాను.. వాళ్లే ట్రాఫిక్‌ క్లియర్ చేశారు. 

నేను రోడ్‌షో, ఊరేగింపు చేయలేదు.. అంత మంది ప్రేమ చూపిస్తున్నప్పుడు నేను కారులో కూర్చుంటే గర్వం ఉందని అనుకుంటారు 

థియేటర్‌లో ఏ పోలీస్ నన్ను కలవలేదు. మా వాళ్లు చెబితేనే నేను వెళ్లిపోయాను. 

రేవతి చనిపోయిందని తర్వాతి రోజే నాకు తెలిసింది.. నా పిల్లలతో కలిసి సినిమా చూశాను, అలా జరిగిందని నాకు తెలియదు. 

తరవాతి రోజు హాస్పటల్‌కు వెళ్దామంటే రావద్దని మావాళ్లు చెప్పారు అంటూ అల్లు అర్జున్ మాట్లాడారు 

Allu Arjun Press Meet highlights :

Revanth Reddy Comments-Allu Arjun Reaction

Tags:   REVANTH REDDY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ