గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ దేవర సక్సెస్ తర్వాత ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా ఆయన తదుపరి చిత్రం వార్ 2 షూటింగ్ సెట్స్ లోకి వెళ్లిపోయారు. హైదరాబాద్, ముంబై అని తిరుగుతూ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. హృతిక్ రోషన్ కాంబోలో ఎన్టీఆర్ హిందీ వార్ 2 తో డైరెక్ట్ గా బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు.
తాజాగా ఎన్టీఆర్ వార్ 2 లెంతి షెడ్యూల్ ఫినిష్ చేసేసారు. ఆయన వార్ 2 షూటింగ్ ఎంత త్వరగా ముగిస్తే అంత స్పీడుగా ప్రశాంత్ నీల్ తో NTR 31 షూటింగ్ మొదలవుతుంది. అయితే వార్ 2 కి సంబందించిన అతిపెద్ద షెడ్యూల్ ముగించిన ఎన్టీఆర్ ని చూసి ఎన్టీఆర్ మాములోడు కాదురా అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
రీసెంట్ గా ఆర్.ఆర్.ఆర్ మూవీ షూటింగ్ విజువల్స్ చూసాక ఎన్టీఆర్ కష్టం అందరికి తెలిసింది. అందుకే అలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం చిన్నపాటి బ్రేక్ తీసుకుని క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకలు కోసం భార్య, పిల్లలతో కలిసి ఎన్టీఆర్ వెకేషన్ కి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది.