కిర్రాక్ ఆర్పీ వైసీపీ మాజీ ఎమ్యెల్యే రోజాను వదలడం లేదు, 2024 ఎన్నికల నుంచి ఆర్పీ రోజాను అవకాశం వచ్చినపుడు కాదు, అవకాశం కలిపించుకుని మరీ ఆడుకుంటున్నాడు. తాజాగా మరోమారు నగరి మాజీ ఎమ్యెల్యే వైస్సార్సీపీ అధికార ప్రతినిధి రోజాను ఓ షోలో ఏసుకున్నాడు. ఈమధ్యన రోజా మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు అర్ధం చేసుకోవాలి, మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కి భయమనేది ఆయన బ్లడ్ లో లేదు అంటూ ఎలివేషన్ ఇచ్చింది.
దానితో ఆర్పీ.. రోజా ఈమధ్యన రాజకీయాలు మానేసి రక్త పరీక్షల కేంద్రాన్ని పెట్టింది. అందుకే జగన్ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేసి ఆయన బ్లడ్ లో భయం లేదు అని తేల్చేసింది. మరి ఎయిర్ పోర్ట్ లో కోడి కత్తి తగిలినప్పుడు, ఎలెక్షన్ ప్రచారంలో గులకరాయి తగిలప్పుడు జగన్ కు రోజా బ్లడ్ టెస్ట్ చేసిందా..
నేను సూటిగా రోజా ను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. రోజమ్మా జగన్ మోహన్ రెడ్డి బ్లడ్ లో భయం లేకపోతే ఆయన అసంబ్లీకి ఎందుకు రావడం లేదు, ఆయనకు భయం లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ అంత పెద్ద కంచె కట్టుకున్నాడు. జగన్ మోహన్ రెడ్డి బ్లడ్ లో భయం లేకపోతే 900 మంది సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నాడు,
జగన్ కి భయం లేకపోతే పరదాల చాటున ప్రజల మధ్యలో ఎందుకు తిరిగాడు, భయం లేకపోతే 2024 ఎన్నికల ఓటమి తర్వాత 18 సార్లు బెంగుళూరు ప్యాలెస్ కి ఎందుకు వెళ్ళాడు, మరి రోజా నువ్వు కూడా ఓడిపోయాక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకుండా చెన్నై వెళ్లి దాక్కున్నావు, నువ్వు జగన్ కి ఎలివేషన్ ఇవ్వడం మానెయ్ అంటూ రోజాకి ఆర్పీ వార్నింగ్ ఇచ్చాడు.