పుష్ప 2 సక్సెస్ తో ఎంజాయ్ చెయ్యాల్సిన రష్మిక మందన్న మహేష్ ఫ్యాన్స్ కు సారీ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. గతంలోనే సరిలేరు నీకెవ్వరూ లాంటి సినిమా చెయ్యను అని స్టేట్మెంట్ట్ ఇచ్చిన నేషనల్ క్రష్ అప్పుడే మహేష్ ఫ్యాన్స్ కు టార్గెట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి మహేష్ ఫ్యాన్స్ ను కెలికింది. దానితో రశ్మికను సోషల్ మీడియాలో ఎక్కడ ఏసుకుంటారో అని వెంటనే సారీ చెప్పేసింది పాప.
ఓ ఇంటర్వ్యూలో రష్మిక తనకి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన గిల్లి సినిమా అంటే తనకి చాలా ఇష్టం అని, ఆ సినిమాని చాలాసార్లు చూసాను, ఆ చిత్రం మహేష్ నటించిన పోకిరి చిత్రానికి రీమేక్ అంటూ చెప్పుకు రావడం.. ఆమె మీద మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యేలా చేసింది. అయితే గిల్లి సినిమా మహేష్ నటించిన ఒక్కడు రీమేక్, పోకిరి రీమేక్ కాదు.
పోకిరిని అదే పేరుతొ తమిళ్ లో రీమేక్ చేశారు. ఆ విషయం తెలుసుకుని తాను చేసింది పొరబాటు అంటూ రియలైజ్ అవ్వడమే కాదు తక్షణమే సారి చెప్పేసింది. ఇంటర్వ్యూ లో విజయ్ గిల్లి సినిమా పోకిరి రీమేక్ అని చెప్పాను. గిల్లి సినిమా ఒక్కడు సినిమా రీమేక్, తప్పయిపోయింది.. సారీ. అది తెలిసి నన్ను ఏసుకుంటారు అనుకున్నాను అంటూ రష్మిక మందన్న పోస్ట్ పెట్టింది. అంతేకాదు ఆ ఇద్దరు స్టార్స్ నటించిన సినిమాలూ నాకు ఇష్టమే అంటూ చెప్పుకొచ్చింది రష్మిక