బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎంటర్ అయ్యి బుల్లితెర ఆడియన్స్ నుంచే కాదు.. హౌస్ లోను కొంతమంది కంటెస్టెంట్స్ కి టార్గెట్ అయిన సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్ నుంచి చాలా త్వరగా అంటే నాలుగో వారంలోనే బయటికి వచ్చేసింది. సీజన్ 8 లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టి విపరీతమైన నెగిటివిటి నడుమ ఆమె ఎలిమినేట్ అయ్యింది.
ఆతర్వాత బిగ్ బాస్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చాక గత నెలలో తన బాయ్ ఫ్రెండ్ యష్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న సోనియా ఆకుల, ఈ నెల 21 న వివాహం చేసుకుంది. బిగ్ బాస్ హోస్ట్ గా చేసిన నాగార్జునను ప్రత్యేకంగా కలిసి సోనియా తన పెళ్ళికి రావాలని ఆహ్వానించింది.
అయితే నిన్న శుక్రవారం రాత్రి జరిగిన సోనియా-యష్ ల రిసెప్షన్ లో నాగార్జున కనిపించలేదు కానీ, స్టార్ మా సీరియల్ ఆర్టిస్ట్ లు, ఇంకా బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ కనిపించారు. ఆ ఫొటోస్ ని బట్టి చూస్తే సోనియా ఆకుల వివాహం అత్యంత వైభవంగా జరిగింది అని చెప్పొచ్చు.