బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్‌గా బయటికొచ్చిన కన్నడ స్టార్ నిఖిల్‌పై బయట మాములుగా ట్రోలింగ్ జరగడం లేదు. అతను హౌస్‌లో ఉన్నప్పుడు, విజేతగా నిలిచి బయటికొచ్చాక కూడా ట్రోలింగ్ జరుగుతుంది. కన్నడ నటులని విన్నర్స్ ని చేసేందుకు బిగ్ బాస్ యాజమాన్యం, నాగార్జున కూడా ప్రయత్నం చేశారు, గౌతమ్‌కి ఓట్లెక్కువ వచ్చినా నిఖిల్ ని విన్నర్‌ని చేసారంటూ మాట్లాడుతున్నారు.
తెలుగు ప్రేక్షకులు తెలుగోడు గౌతమ్‌ని సపోర్ట్ చేశారు, కానీ బిగ్ బాస్ యాజమాన్యం, నాగార్జున అంతా నిఖిల్ వైపే ఉన్నారన్నారు. తాజాగా నిఖిల్ ఛానల్ ఇంటర్వూస్‌లో మాట్లాడుతూ.. తనపై బయట విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోందన్నాడు, హౌస్ నుంచి బయటికొచ్చాక తనపై ఎందుకు నెగిటివిటి వచ్చిందో, ఏం జరిగిందో తెలుసుకున్నానని చెప్పాడు.
తనపై ఎవరు నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో, దీని వెనుక ఎవరున్నారో తనకు బాగా తెలుసని, వాడు దీనిని వెంటనే ఆపేయ్యాలని నిఖిల్ వార్నింగ్ ఇచ్చాడు. నన్ను ఏమైనా అనండి, నా మీద ఎంతైనా రాసుకోండి కానీ ఫ్యామిలీని, ఇష్టమైన వాళ్లని ఇందులోకి లాగొద్దని.. తాను యాక్షన్‌లోకి దిగితే తట్టుకోలేరు అంటూ బిగ్ బాస్8 విన్నర్ నిఖిల్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు.