నేషనల్ క్రష్ రశ్మిక ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు టాప్ హీరోయిన్ గానే కనిపిస్తుంది. పాన్ ఇండియా హిట్స్ తో క్రేజీ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గేదేలే అంటుంది. అందులోను బాలీవుడ్ కి వెళ్ళాక అమ్మడు మరింతగా అందాలు ఆరబోస్తుంది.
పుష్ప2 చిత్రంలో అల్లు అర్జున్ తో కలిసి పీలింగ్స్ అనే పాటలో రష్మిక అందాల జోరుకు యూత్ మొత్తం షాకైపోయింది. సోషల్ మీడియా లోను రష్మిక పోస్ట్ చేసే గ్లామర్ పిక్స్ చూస్తే నిజంగా మతిపోతుంది. పుష్ప ద రూల్ ప్రతి ఈవెంట్ లోను రష్మిక చీర కట్టులో గ్లామర్ జాతర చేసింది.
తాజాగా రష్మిక మందన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్ చూస్తే ఇలా అయితే యూత్ తట్టుకుంటుందా బేబీ అంటారేమో.. నా హీరోయిన్ క్షణం అంటూ రష్మిక బ్లాక్ మోడ్రెన్ డ్రెస్ లో కత్తిలాంటి ఫోజులతో అందాల జాతర చేసింది. మీరు కూడా రష్మిక బ్యూటిఫుల్ లుక్ పై ఓ కనెయ్యండి.