అఖిల్ అక్కినేని చాలా నెలల విరామం తర్వాత తన తదుపరి మూవీని వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడితో మొదలు పెట్టాడు. ఈ వారంలోనే క్రితమే అఖిల్ కొత్త ప్రాజెక్ట్ సైలెంట్ గా పూజా కార్యక్రమాలతో మొదలైనప్పటికీ.. ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కనీసం సినిమా మొదలయ్యింది అని కానీ, లేదంటే ఈ ప్రాజెక్ట్ ని సితార తో కలిసి అన్నపూర్ణ బ్యానర్ లో నిర్మితమవుతుంది అని కానీ ఎక్కడా ఎలాంటి అప్డేట్ లేదు.
అఖిల్ కొత్త సినిమాలో కిస్సిక్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ అంటున్నారు తప్ప మేకర్స్ కన్ ఫర్మ్ చేసింది లేదు. అఖిల్-శ్రీలీల ప్రాజెక్ట్ పై ఏదో ఒక అప్ డేట్ ఇస్తే బావుండేది అని అక్కినేని అభిమానుల కోరిక. చాలా రోజుల తర్వాత సెట్స్ మీదకి వెళ్ళబోతున్న అఖిల్ మూవీ ని ట్రెండ్ చెయ్యాలనేది వారి ఆలోచన.
మరి అఖిల్ మాత్రం సైలెంట్ గా మూవీ స్టార్ట్ చేసేసి సెట్స్ మీదకి వెళ్ళాడు, అసలు అఖిల్ షూటింగ్ లో పాల్గొంటున్నాడా లేదా, ఎప్పుడు సెట్స్ లోకి వెళతాడని అంటూ అక్కినేని అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు.