Advertisementt

మెడలో తాళి తో మోడ్రెన్ లుక్ లో కీర్తి సురేష్

Thu 19th Dec 2024 09:44 AM
keerthy suresh  మెడలో తాళి తో మోడ్రెన్ లుక్ లో కీర్తి సురేష్
Newlywed Keerthy Suresh makes her first public appearance మెడలో తాళి తో మోడ్రెన్ లుక్ లో కీర్తి సురేష్
Advertisement
Ads by CJ

డిసెంబర్ 5 న గోవాలో తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనిని హిందూ సంప్రదాయంలో ఇరు కుటుంబాల నడుమ సింపుల్ గా వివాహం చేసుకున్న కీర్తి సురేష్, ఆ తరవాత రెండురోజులకి ఆంటోనీతో క్రిష్టియన్ పద్దతిలో మరో వివాహం చేసుకుని ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

అయితే పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత కూడా కీర్తి సురేష్ తాను నటించిన హిందీ మూవీ బేబీ జాన్ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. పెళ్లి తర్వాత హనీమూన్ కూడా పక్కనపెట్టేసి మరీ బేబీ జాన్ ప్రమోషన్స్ కి వచ్చేసింది. డిసెంబర్ లో పెళ్లి అన్న తర్వాతే ఆమె సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ వదులుతూ అందరికి షాకిచ్చింది. 

పోనీలే బాలీవుడ్ మూవీలో నటించింది ఆ మాత్రం ఉండాలిలే అనుకుంటే.. పెళ్ళైన పదిరోజులకే కీర్తి సురేష్ మెడలో తాళి బొట్టుతో మోడ్రెన్  లుక్ కనిపించి షాకిచ్చింది. కొత్తపెళ్లి కూతురిలా మెరిసిపోతూ బేబీ జాన్ ప్రమోషన్స్ లో వరుణ్ ధావన్ తో కలిసి రెడ్ మోడ్రెన్ డ్రెస్ లో కీర్తి సురేష్ మెడలో తాళి తో కనిపించింది. 

కీర్తి సురేష్ మెడలో తాళి తో మోడరన్ లూక్ లో కనిపించడం ఆమె అభిమానులను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం లేటెస్ట్ మోడ్రెన్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Newlywed Keerthy Suresh makes her first public appearance:

Keerthy Suresh new look after marriage 

Tags:   KEERTHY SURESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ