నందమూరి మోక్షజ్ఞ రాకరాక సినిమాల్లోకి అడుగుపెడుతుంటే.. ఆయన డెబ్యూ సినిమా విషయంలో ఏదో జరిగి ఆ చిత్రం పూజా కార్యక్రమాలు జరక్కుండానే ఆగిపోయింది అని నందమూరి అభిమానులు చాలా డిజప్పాయింట్ అవుతున్నారు. నందమూరి మోక్షజ్ఞ మేకోవర్ కి ఇంప్రెస్స్ అయిన నందమూరి అభిమానులకు మోక్షజ్ఞ డెబ్యూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అనేసరికి ఇంకాస్త ఎగ్జైట్ అయ్యారు.
ప్రశాంత్ వర్మ-మోక్షజ్ఞ మూవీ అనౌన్సమెంట్ పోస్టర్ తోనే అంచనాలు క్రియేట్ చేసారు. ఇక సినిమా ఓపెనింగ్ అనుకుంటున్న సమయంలో మోక్షజ్ఞ మూవీపై రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. మోక్షు మొదటి సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకోకుండానే ఆగిపోయింది అన్నారు. దానితో ఫ్యాన్స్ ఫీలైపోయారు.
అయితే నిప్పు లేకుండా పొగ రాదు, ప్రశాంత్ వర్మ మోక్షు సినిమాని పక్కనపెట్టి మరో సినిమా స్క్రిప్ట్ లో బిజీ అవడంతో బాలయ్యకు కోపమొచ్చింది, మోక్షజ్ఞ కు-ప్రశాంత్ వర్మకు మధ్యన డిఫరెన్సెస్ వచ్చాయంటూ ఏవేవో న్యూస్ లు అభిమానులను డిస్టర్బ్ చేసాయి. అయితే అవన్నీ గాలి వార్తలే.. అంటూ మేకర్స్ తాజాగా ఓ నోట్ వదిలారు.
ప్రశాంత్ వర్మ-మోక్షజ్ఞ మూవీ ఆగిపోలేదు, ఈ ప్రాజెక్టుపై వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాము, అప్పటివరకు ఈప్రాజెక్టు పై వచ్చే ఎలాంటి వార్తలను నమ్మొద్దు అంటూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు మేకర్స్.