ఈమధ్యన కొద్దిరోజులు శ్రీలీల పేరు టాలీవుడ్లో వినబడకపోయేసరికి శ్రీలీల ఎంత వేగంగా దూసుకొచ్చిందో.. అంతే వేగంగా కనుమరుగవుతుందేమో అంటూ నెటిజెన్స్ మట్లాడుకున్నారు. గుంటూరు కారం తర్వాత శ్రీలీల కాస్త డల్ అయిన మాట వాస్తవమే.. కానీ మళ్ళీ ఎగిసిన కెరటంలా శ్రీలీల హావా మళ్లీ మొదలు కాబోతుంది.
వరస ఆఫర్స్ తో శ్రీలీల పేరు మరోమారు టాలీవుడ్ లో మోగిపోతుంది. రాబిన్ హుడ్ తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్న శ్రీలీల మాస్ జాతర తో వచ్చే ఏడాది ప్రేక్షకులముందుకు వస్తుంది. ఈలోపులో శ్రీలీల కి మూడు బిగ్ ఆఫర్స్ తగిలాయి. టాలీవుడ్ యంగ్ హీరోలు శ్రీలీల ని తమ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు.
అందులో ఒకటి నాగ చైతన్య-కార్తీక్ దండు మూవీ, మరొకటి సిద్దు జొన్నలగడ్డ మూవీ, ఇంకొకటి అఖిల్ కొత్త ప్రాజెక్ట్ లోను శ్రీలీలే హీరోయిన్. మరి ఇలాంటి సమయంలో అమ్మడు ఫొటోస్ సోషల్ మీడియాలో కనబడితే అభిమానులు ఆగుతారా.. ట్రెండ్ చేస్తూ రచ్చ చెయ్యరు.
తాజాగా శ్రీలీల నుంచి బయటికొచ్చిన ట్రెండీ ఫోజులు వైరల్ అయ్యాయి. ఆ ఫొటోస్ చూడగానే వావ్ స్టన్నింగ్ శ్రీలీల అంటూ కామెంట్ చేస్తున్నారు.