ఇప్పటివరకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్స్ గెలిచి, వారు ఏం చేస్తున్నారో ఎవ్వరికి తెలియదు. మొదటి సీజన్ లో ట్రోఫీ అందుకున్న శివబాలాజీ నుంచి గత ఏడాది అంటే సీజన్ 7 బిగ్ బాస్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ వరకు ఏ విన్నర్ కూడా కేరీర్లో వెలిగిపోయింది లేదు. బిగ్ బాస్ వలన తమకేమి ఒరగలేదని చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు కూడా.
శివబాలాజీ బిగ్ బాస్ కప్ కొట్టుకొచ్చాక నటుడిగా యాక్టీవ్ అవ్వలేదు, అలాగే రెండో సీజన్ విన్నర్ కౌశల్ మండా హీరోగా పాపులర్ అవ్వలేదు, అటు డైరెక్షన్ అన్నా అది వర్కౌట్ అవ్వలేదు. ఇక మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తన టాలెంట్ తో ఆస్కార్ స్టేజ్ వరకు వెళ్ళాడు, నాలుగో సీజన్ విన్నర్ అభిజిత్ ఏమైపోయాడో కూడా ఎవ్వరికి తెలియరాలేదు.
ఐదో సీజన్ విన్నర్ సన్నీ మొదట్లో హడావిడి చేసినా ఇప్పుడు బిగ్ బాస్ ఊసుకూడా ఎత్తడమే లేదు. ఆరో సీజన్ విన్నర్ సింగర్ రేవంత్ బిగ్ బాస్ కి ముందు స్టేజ్ లపై కనిపించేవాడు, బిగ్ బాస్ విన్నర్ అయ్యాక ఆ స్టేజ్ పై కూడా కనిపించడం లేదు. గత ఏడాది రైతు బిడ్డగా బిల్డప్ ఇచ్చి టైటిల్ అందుకున్న పల్లవి ప్రశాంత్ బుల్లితెర షోస్ లో కనిపిస్తున్నాడు తప్ప పీకింది ఏమి లేదు.
ఇప్పుడు సీరియల్ యాక్టర్ నిఖిల్ సీజన్ 8 విన్నర్ అయ్యాడు. ఆ విన్నర్ అయిన హ్యాపీనెస్ కూడా దక్కలేదు, టైటిల్ తీసుకుని సైలెంట్ గా ఇంటికెళ్లిపోయాడు. ఇకపై నిఖిల్ ఏమైనా నటుడిగా యాక్టీవ్ అవుతాడో లేదో చూడాలి, వెండితెర మీద వెలగకపోయినా.. బుల్లితెరపై అందులోను స్టార్ మా లో సీరియల్ అవకాశం ఇచ్చి ఆదుకుంటుందిలే నిఖిలూ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.