Advertisementt

పవన్ సిగ్నల్ కోసం అల్లు అర్జున్ ఎదురు చూపు

Wed 18th Dec 2024 02:03 PM
allu arjun  పవన్ సిగ్నల్ కోసం అల్లు అర్జున్ ఎదురు చూపు
Allu Arjun waits for Pawan signal పవన్ సిగ్నల్ కోసం అల్లు అర్జున్ ఎదురు చూపు
Advertisement
Ads by CJ

ఈమధ్యన సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో అరెస్ట్ అయ్యి ఒక్కరోజు జైలులో ఉండొచ్చిన అల్లు అర్జున్ ఆతర్వాత రోజు తన ఇంటికి తనని పరామర్శించడానికి వచ్చిన సినీ ప్రముఖులతో గడిపారు. ఆ నెక్స్ట్ డే ఆదివారం మేనత్త-మెగాస్టార్ ఇంటికి లంచ్ కి వెళ్లొచ్చిన అల్లు అర్జున్ పనిలో పనిగా నాగబాబుని కలిశారు. 

మెగా ఫ్యామిలీ తన ఇంటికొచ్చింది, తనని అరెస్ట్ చేసిన సమయంలో తన ఫ్యామిలికి అండగా ఉన్నందుకు కృతఙ్ఞతలు తెలపడానికి అల్లు అర్జున్ పనిగట్టుకుని మావయ్యల ఇంటికి వెళ్లారు. అయితే అప్పటి నుంచి అల్లు అర్జున్ పవన్ ని కలవబోతున్నారు, పవన్ హైదరాబాద్ వచ్చింది అల్లు అర్జున్ ని కలవడానికి అనే ప్రచారం మాములుగా జరగడం లేదు. 

గత రెండు రోజులుగా అల్లు అర్జున్ అమరావతికి వెళ్లబోతున్నాడు, పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు ఆయన అప్పోయిన్మెంట్ కోసం అల్లు అర్జున్ వెయిటింగ్, ఏ క్షణాన అయినా అల్లు అర్జున్ భార్యతో కలిసి హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారట. 

పవన్ రమ్మంటే వెంటనే పవన్ ని కలిసేందుకు ఆయన వెళ్తారట. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. పవన్ పిలుపు కోసం అల్లు అర్జున్ వెయిటింగ్ అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Allu Arjun waits for Pawan signal:

Allu Arjun waiting for Pawan Kalyan signal

Tags:   ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ