నాగ చైతన్య-శోభితల వివాహమేమో కానీ సమంత కి తిప్పలొచ్చాయనే చెప్పాయి. నాగ చైతన్య తో విడిపోయాక సమంత ఎంతగా ట్రోలింగ్ కి గురయ్యిందో అందరూ చూసారు. ఆ విడాకుల విషయంలో సమంత దే తప్పన్నట్టుగా మట్లాడుకున్నారు జనాలు. ఎలాగో ఆ విడాకుల పెయిన్ ని అధిగమించి మాయోసైటిస్ వ్యాధి బారిన పడి కోలుకుని తనపనేదో తాను చేసుకుంటుంది.
ఇలాంటి సమయంలో నాగ చైతన్య రెండో పెళ్లి సమంతకు తలనొప్పి గా మారింది. పెళ్లి చేసుకున్న జంట ఎంజాయ్ చెయ్యడమే కాదు తమ పరిచయమేలా అయ్యిందో అనే విషయంలో శోభిత చెప్పిన ముచ్చట్లలోకి సమంతని లాగి ఆమెలోని తప్పొప్పులను వెతుకుతున్నారు. శోభిత నాగ చైతన్యకు తెలుగు మాట్లాడడం అంటే ఇష్టం, నన్ను ఎక్కువగా తెలుగులోనే మాట్లాడమనేవారు అని చెప్పింది.
అంతేకాదు గ్లామర్ ఫొటోస్ కి లైక్ చెయ్యరు, మంచి విషయాలు,స్ఫూర్తిదాయకమైన విషయాలను పోస్ట్ చేస్తే చైతు లైక్ చేస్తారని చెప్పింది. అంటే సమంత తెలుగు మాట్లాడేది కాదా? సమంత గ్లామర్ చైతూకి నచ్చలేదా? చైతు ఆ విషయం సమంతకి చెప్పినా ఆమె వినలేదా? అందుకే వారికి విడాకులయ్యాయా? అంటూ సమంత లోని తప్పులను వెతికే పనిలో కొంతమంది బిజీ అయ్యారు.
మరి సమంత తో విడాకులైన ఏడాదికే చైతు శోభిత ప్రేమలో పడిపోయాడు. ఇప్పుడు ఎంకి పెళ్లి సుబ్బి చావుకు రావడమంటే ఇదేనేమో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.