అడవి శేష్ డకాయిట్ చిత్రంలో ముందుగా సలార్ భామ శృతి హాసన్ హీరోయిన్ గా వచ్చి చేరింది. ఆమెపై కొంత షూటింగ్ కూడా చేశాక, ఫస్ట్ లుక్ వదిలాకే ఎందుకో శృతి హాసన్ డకాయిట్ చిత్రం నుంచి తప్పుకుంది. అయితే శృతి హాసన్ ఏ కారణంగా డకాయిట్ నుంచి తప్పకుందో ఎవ్వరికి తెలియదు కానీ ఆమె ప్లేస్ లోకి వేరే ఏ హీరోయిన్ వచ్చిందో అనేది కూడా టీమ్ బయటపెట్టలేదు.
తాజాగా అడివి శేష్ బర్త్ డే రోజున డకాయిట్ లోకి వచ్చిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ విషయాన్ని అఫిషియల్ గా ప్రకటించారు మేకర్స్. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ తర్వాత మృణాల్ తెలుగు ప్రాజెక్ట్ కి సైన్ చెయ్యలేదు అనుకుంటున్నారు. కానీ అడివి శేష్ డకాయిట్ చిత్రంలోకి మృణాల్ కామ్ గా ఎంటర్ అయ్యింది.
ఆ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఎందు చేతనో శృతిహాసన్ వదులుకున్న డెకాయిట్ పాత్రను మృణాల్ ఠాకూర్ పట్టేసి మళ్ళీ తెలుగులో బిజీ అవుతుంది.