పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కాలికి గాయమై షూటింగ్స్ కి దూరంగా ఉంటున్నారు. రాజా సాబ్ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కాగా.. హను రాఘవపూడి ఫౌజీ షూటింగ్ కి ప్రభాస్ బ్రేకిచ్చారు. ఆయన శీలమండి బెణకడంతో షూటింగ్ కి కాస్త బ్రేకిచ్చారు అని చెబుతున్నారు. అయితే గత రెండు రోజులుగా ప్రభాస్-మారుతిల రాజా సాబ్ మూవీ రిలీజ్ ఏప్రిల్ నుంచి వాయిదా పడనుంది అనే వార్త చక్కర్లు కొడుతోంది.
ప్రభాస్ కాలికి గాయమవడం వలన ఏప్రిల్ 10 న విడుదల కావాల్సిన రాజా సాబ్ విడుదల వాయిదా పడుతుందా, లేదంటే అనుష్క ఘాటీ రాజాసాబ్ విడుదలైన వారానికే బాక్సాఫీసు వద్దకు రాబోతుంది, అనుష్క కోసం ప్రభాస్ రాజా సాబ్ ని వాయిదా వేస్తున్నారో అనే ముచ్చట సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది.
అయితే ప్రభాస్ కాలికి పెద్ద దెబ్బె తగిలింది. అందుకే జపాన్ లో జరగబోయే కల్కి ప్రమోషన్స్ కి వెళ్ళలేదు, ఆయనకి తగిలింది చిన్న దెబ్బె అంటున్నా.. ప్రమోషన్స్ కి రాలేని స్థితిలో ఉంటే అది చిన్నదెలా అవుతుంది అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆ దెబ్బ వలన రెండు వారాల పాటు షూటింగ్ చెయ్యకుండా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.
కాబట్టే రాజా సాబ్ షూటింగ్ ఆగింది.. అలా సినిమా విడుదల కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయంటున్నారు. మరి ఈ గుసగుసలపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.