పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఒకొనొక సమయంలో మృణాల్ ఠాకూర్ రొమాన్స్ చెయ్యడం ఖాయం, హను రాఘవపూడి తన సీతను వదలరని అనుకున్నారు. హను రాఘవపూడి-ప్రభాస్ కాంబోలో రీసెంట్ గా మొదలైన ఫౌజీ చిత్రంలో ముందుగా మృణాల్ ఠాకూర్ ని హీరోయిన్ గా అనుకుంటున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ హను మృణాల్ కి షాకిచ్చి ఆ ప్లేస్ లోకి కొత్త అమ్మాయి ఇమాన్విని తీసుకొచ్చారు.
ప్రభాస్ తో అప్పుడు మిస్ అయిన ఛాన్స్ మృణాల్ ఠాకూర్ కి ఇప్పుడు దొరకబోతుందా, అంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అదే నిజమని అనిపిస్తుంది. మృణాల్ ఠాకూర్ ఓ ఈవెంట్ లో తనకు అందరి హీరోలకన్నా ఎక్కువ ప్రభాస్ అంటే ఇష్టం, తర్వాత విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని చెప్పిన వీడియో వైరల్ అయ్యింది.
ఆ వీడియో చూసాక మృణాల్ ఠాకూర్ ప్రభాస్-సందీప్ రెడ్డి వంగ కాంబోలో మొదలు కాబోయే స్పిరిట్ లో హీరోయిన్ అంటూ ఉహాగానాలు మొదలైపోయాయి. మరి స్పిరిట్ లో ప్రభాస్ జోడిగా కరీనా పేరు వినిపిస్తోంది. కాదు సోషల్ మీడియా టాక్ నిజమైతే.... మృణాల్ కి అదృష్టం పట్టినట్లే.