పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు గాయమైంది. ఆయన షూటింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డారు అని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, హను రాఘవపూడి చిత్ర షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఆయన ఓ సినిమా షూటింగ్ లో గాయపడ్డారని వార్తలు అభినులను ఆందోళనకు గురి చేసింది.
ఓ సినిమా షూటింగ్ చిత్రీకరణ సమయంలో ప్రభాస్ చీలమండ బెనికిందని తెలుస్తోంది. అందుకే ఆయన కల్కి ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోతున్నారట. ఈ గాయం వలన జపాన్ లో వచ్చే నెల 3వ తేదీన రిలీజయ్యే కల్కి ప్రమోషన్లకు హాజరవట్లేదని ప్రభాస్ టీమ్ తెలియజేసింది.
కల్కి డిస్ట్రిబ్యూటర్ల టీమ్ ప్రమోషన్స్ లో పాల్గొంటుందని తెలపడంతో ప్రభాస్ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.