Advertisementt

బిగ్ బాస్ 8-అత్యంత చెత్త సీజన్ ఇదే

Mon 16th Dec 2024 03:53 PM
bigg boss 8  బిగ్ బాస్ 8-అత్యంత చెత్త సీజన్ ఇదే
Bigg Boss 8- This is the worst season ever బిగ్ బాస్ 8-అత్యంత చెత్త సీజన్ ఇదే
Advertisement
Ads by CJ

మొదట్లో బిగ్ బాస్ పై ఉన్న క్రేజ్ ఇప్పుడు కనిపించడం లేదు. బుల్లితెర ప్రేక్షకులు ఎన్టీఆర్, నాని, నాగ్ హోస్ట్ చేసిన మొదటి మూడు సీజన్స్ ఇంట్రెస్ట్ గా కనిపించినా ఆ తర్వాత సీజన్స్ పై బోర్ ఫీలవుతున్నారు. గత మూడు సీజన్స్ నుంచి బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు కరువయ్యారు అనే చెప్పాలి. రొటీన్ గా చప్పగా సాగుతున్న బిగ్ బాస్ లో అత్యంత చెత్త సీజన్ గా బిగ్ బాస్ సీజన 8 రికార్డ్ క్రియేట్ చేసింది. 

ఈమాట మేమంటున్నది కాదు.. సోషల్ మీడియా చూస్తే కనిపించే న్యూస్ లు ఇవే, బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో రామ్ చరణ్ వచ్చినా ఈ ఎపిసోడ్ పై అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. రొటీన్ డాన్స్ లు, రొటీన్ పాటలు, రొటీన్ మూవీ ప్రమోషన్స్ తప్ప కొత్తగా ఆసక్తి కలిగించే అంశాలేవీ ఈ ఎపిసోడ్ లో హైలెట్ అవ్వలేదు. 

రామ్ చరణ్ వచ్చారు కాసేఫు ఎంజాయ్ చేశారు వెళ్లిపోయారు తప్ప మిగతాది ఏమి లేదు. ఇక సీజన్ లో కన్నడ vs తెలుగు కంటెస్టెంట్స్ అంటూ తెగ హైలెట్ అయ్యింది. టాస్క్ ల పరంగాను ఇంట్రెస్టింగ్ గేమ్స్ లేవు, పాత కంటెస్టెంట్స్-వైల్డ్ కార్డ్స్ అంటూ హంగామా తప్ప, నామినేషన్స్ లో చెత్త మాటలు ఇవే ఈ సీజన్ మొత్తం పరమ  బోరింగ్, పరమ చెత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

Bigg Boss 8- This is the worst season ever:

Bigg Boss 8-Telugu

Tags:   BIGG BOSS 8
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ