గత 20 నెలలుగా అక్కినేని అభిమానులు వెయిట్ చేస్తున్న క్షణం రానే వచ్చింది. గత ఏడాది ఏప్రిల్ లో ఏజెంట్ చిత్రం తర్వాత మాయమైన అఖిల్ తన కొత్త చిత్రాన్ని మొదలు పెట్టడానికి తీసుకున్న సమయం ఖచ్చితంగా 20 నెలల సమయం. ఈ 20 నెలల సమయంలో అఖిలేలా ఉన్నాడో కూడా మీడియాకి కనిపించింది చాలా తక్కువ, అందుకే అభిమానుల్లో చాలా ఆందోళన కనిపించింది.
తాజాగా అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకుని అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు, ఇప్పుడు కొత్త సినిమా మొదలు పెట్టి కూల్ గా అభిమానులకు సైలెంట్ గా సర్ ప్రైజ్ చేసాడు. నిన్న అన్నపూర్ణ.. సితార సంస్థలు కలిసి నిర్మించిబోయే సినిమా కి పూజా కార్యక్రమాలు జరిగాయి. వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడితో అఖిల్ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాడు. ఈ చిత్రంలోఅఖిల్ సరసన కిస్సిక్ బ్యూటీ శ్రీలీల ఎంపికైనట్లుగా తెలుస్తోంది.
సైలెంట్ గా సినిమా మొదలు పెట్టినప్పటికీ.. అఖిల్ కొత్త సినిమా మొదలు కావడంతో అభిమానులు మాత్రం చాలా సర్ ప్రైజ్ అవుతూ ఎగ్జైట్ అవుతున్నారు. ఫైనల్లీ అఖిల్ సెట్స్ లోకి అంటూ వారు ఉత్సాహపడుతున్నారు.