దర్శకుడు వెంకీ అట్లూరి కి తెలుగు హీరోలు అవకాశాలు ఇవ్వడం లేదా? లేదంటే ఆయనే తెలుగు హీరోలు వద్దనుకుంటున్నారా? అనేది మాత్రం అందరికి మిష్టరీగా మిగులుతున్న ప్రశ్న. నిర్మాత నాగవంశీ బ్యానర్ లో వెంకీ అట్లూరి వరస హిట్స్ సాధిస్తున్నారు. మరి నిర్మాత నాగవంశీకి తెలుగు హీరో లతో మంచి అనుబంధమే ఉంది.
కానీ నాగవంశీ-వెంకీ అట్లూరి కాంబో మాత్రం తెలుగు హీరోలను పట్టించుకోవడం లేదో, లేదంటే వారు వీళ్ళను కన్సిడర్ చెయ్యట్లేదో కాని.. ఈ కాంబో వరసగా ఇతర భాషల హీరోలపై ఫోక్స్ పెడుతున్నారు. హిట్లు కొడుతున్నారు. గతంలో తమిళ హీరో ధనుష్ తో సార్ మూవీతో డీసెంట్ హాట్ కొట్టిన వెంకీ అట్లూరి.. ఈమధ్యన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
100 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ దర్శకుడిగా అవతరించిన వెంకీ అట్లూరి తన తదుపరి మూవీ ఎవరితో ఉంటుంది, ఏ హీరోని లైన్ లో పెడతాడో అని అందరూ క్యూరియాసిటీతో ఎదురు చూస్తుంటే.. తాజాగా వెంకీ అట్లూరి-నాగ వంశీ కలిసి ముంబై వెళ్లి కోలీవుడ్ హీరో సూర్యను కలవడం హాట్ టాపిక్ అయ్యింది.
మరి ముంబై వెళ్లి సుర్యను కలవడమంటే కథ చెప్పడానికే కావొచ్చు. సూర్య-వెంకీ అట్లూరి కాంబో ఏ క్షణాన అయినా ఫిక్స్ అవ్వొచ్చనే వార్తలు చూసి.. ఏంటి వెంకీ అట్లూరికి తెలుగు హీరోలు వద్దా అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.