జిమ్ లో గాయపడి ఇంకా రెస్ట్ లోనే ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చెయ్యడం మాత్రం మానడంలేదు. రోజుకో స్పెషల్ ఫోటో షూట్ ని షేర్ చేస్తూ అట్రాక్ట్ చేస్తూనే ఉంది. జిమ్ లో తగిలిన గాయానికి ఆమె ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది.
ఆమె షూటింగ్స్ తో బిజీగా వున్నా జిమ్ లో వర్కౌట్స్ మానేది కాదు, బాడీ ఫిట్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలని చెప్పే రకుల్ ప్రీతికి జిమ్ బిజినెస్ కూడా ఉంది. ప్రస్తుతం జిమ్ చెయ్యకుండా హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాను అని చెబుతున్న రకుల్ ప్రీత్ తాజాగా వదిలిన పిక్స్ చూస్తే మతిపోవాల్సిందే.
టూ గ్లామర్ షో చేస్తూ కిర్రాక్ లుక్ లో రకుల్ దర్శనం అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. మోడ్రెన్ డ్రెస్ లో ట్రెండీ లుక్ తో రకుల్ ప్రీత్ నిజంగా మెస్మరైజ్ చేసింది. మీరు కూడా రకుల్ ప్రీత్ లేటెస్ట్ పిక్స్ పై ఓ లుక్కెయ్యండి.