Advertisementt

ఇంకా పరారీలోనే పేర్ని నాని ఫ్యామిలీ

Sun 15th Dec 2024 02:39 PM
nani  ఇంకా పరారీలోనే పేర్ని నాని ఫ్యామిలీ
Former minister Perni Nani family goes into hiding ఇంకా పరారీలోనే పేర్ని నాని ఫ్యామిలీ
Advertisement
Ads by CJ

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని కుటుంబం పరారీలో ఉంది. సొంత గోదాము నుంచి 3,708 బస్తాల రేషన్ బియ్యం మాయమైన కేసులో తమ చుట్టూ ఉచ్చు బిగుస్తుండటంతో అరెస్ట్ తప్పదని భావించిన నాని, ఆయన భార్య జయసుధ ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఎందుకంటే వైసీపీ ఘోర పరాజయం పాలైన తరవాత తొలిసారి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా, నిరసనలకు పిలుపునిచ్చింది. అన్నదాతకు అండగా అంటూ 13 తారీఖున వైసీపీ కార్యక్రమం నిర్వహించినా ఎక్కడా ఆయన కనిపించలేదు.. వినిపించలేదు. చీటికీ మాటికీ మీడియా ముందుకు వచ్చే నాని.. ధర్నాలో పాల్గొనకపోవడం, అనుచరులు ఎవరికీ కనీసం ఫోన్ టచ్ లో కూడా లేకపోవడం గమనార్హం.

ఎందుకు.. ఏమైంది..? 

పేర్ని నాని సతీమణి జయసుధ పేరిట మచిలీపట్నంలో కొన్ని గోదాములు ఉన్నాయి. వీటిని ప్రభుత్వ పౌరసరఫరాల శాఖకు లీజు ప్రాతిపదికన అప్పగించడం జరిగింది. వైసీపీ హయాంలో నుంచి ఇప్పటి వరకూ పౌరసంబంధాల శాఖ ద్వారా పంపిణీ చేసే బియ్యాన్ని ఈ గోదాముల్లో ప్రభుత్వం నిల్వ చేస్తోంది. భారీ స్థాయిలో నిల్వ ఉండే బస్తాలలో ఇటీవల తనిఖీలు నిర్వహించగా భారీగా అవకతవకలు బయటపడ్డాయి. ప్రభుత్వం నిల్వ ఉంచిన బియ్యంలో ఏకంగా 3,708 బస్తాల రేషన్ బియ్యం మాయం కావడం రాష్ట్రంలో పెద్ద సంచలనమే అయ్యింది. సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదు మేరకు మచిలీపట్నం తాలూకా పోలీసులు నాని భార్య జయసుధతో పాటు, మేనేజర్ మానస్ తేజపై అధికారులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ తప్పదని బావించిన పేర్నీ నాని కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలిసింది.

ఎప్పుడు బయటికి వచ్చేది..?

ఎందుకంటే అసలే రేషన్ అక్రమాలపై సీరియస్ గా ఉన్న సర్కార్.. ఇక్కడ బియ్యం మాయం అయ్యాయని తేలడం, పైగా ప్రభుత్వంపై కూడా నానీ ఇష్టానుసారం మాట్లాడం ఈ విషయాలన్నింటిపైన ఆగ్రహంగా ఉన్న సర్కార్ అవకాశం దొరికింది కదా అని పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో చేసేదేమీ జిల్లా కోర్టు, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే తప్ప ఆయన ఫ్యామిలీ బయటికి వచ్చే పరిస్థితులు ఏ మాత్రం కనిపించడం లేదు.

Former minister Perni Nani family goes into hiding:

YSRCP EX Minister Perni Nani Family Escape 

Tags:   NANI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ