మెగా-అల్లు ఫ్యామిలీస్ మధ్యన మనస్పర్ధలు, అల్లు అర్జున్ సోలోగా ఎదిగేందుకు మెగా ట్యాగ్ ని దూరం చేసుకుంటున్నాడు, అల్లు ఆర్మీ పేరుతో సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంటున్నాడు, మెగా వృక్షం కింద నుంచి అల్లు అర్జున్ బయటికి వచ్చేస్తున్నాడు, అందుకే పవన్ విషయంలో అల్లు అర్జున్ అలా చేస్తున్నాడు, కాబట్టే నాగబాబుకు, వరుణ్ కి అల్లు అర్జున్ అంటే కోపమనే వార్తలు చూస్తున్నాము.
కానీ అల్లు అర్జున్ అరెస్ట్ ఒక్కసారిగా మెగా-అల్లు ఫ్యామిలీస్ ని ఒక్కటి చేసింది. మెగా ఫ్యామిలీ మొత్తం అరవింద్ ఇంటికొచ్చింది. ఇప్పడు అల్లు అర్జున్ సతీ సమేతంగా మెగాస్టార్ ఇంటికి వెళుతున్నాడు. ఈరోజు ఆదివారం మెగాస్టార్ కుటుంబం తో కలిసి లంచ్ చేయనున్న అల్లు అర్జున్ అనే వార్త చూసి వివాదాలు, విమర్శలకు ఇక పులిస్టాప్ అంటూ మెగా-అల్లు అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
కాసేపట్లో చిరంజీవి ఇంటికి వెళ్లనున్న అల్లు అర్జున్, ఆయన చిరు ఫ్యామిలీతో కలిసి లంచ్ చేయబోతున్నారని తెలుస్తోంది. కాగా మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ కాగానే చిరు తన షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడిన విషయం తెలిసిందే. నిన్న జైలు నుంచి బన్నీ విడుదలైన తర్వాత మెగాస్టార్ సతీమణి సురేఖ అరవింద్ ఇంటికి వెళ్లి మేనల్లుడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.