గత ఏడాది తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరితో ఎలా ఉన్నా సినిమా ఇండస్ట్రీపై మాత్రం యుద్ధం ప్రకటించారు అనుకోవాలి. అందులో భాగంగా ముందుగా హైడ్రా పేరుతొ నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూలదోయ్యడం, తర్వాత హైకోర్టు రేవంత్ ప్రభుత్వానికి మొట్టికాయలు వెయ్యడం అన్ని చూసాం.
ఇప్పుడు స్టార్ హీరో అందులోను మెగా హీరోను రేవంత్ ప్రభుత్వం టచ్ చెయ్యడం మరింత హాట్ టాపిక్ అయ్యింది. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చెయ్యడం పై రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలొచ్చాయి. అల్లు అర్జున్ పుష్ప 2 సక్సెస్ మీట్ లో రేవంత్ రెడ్డి పేరు చెప్పకపోవడంపై రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి రివెంజ్ తీర్చుకున్నారని సోషల్ మీడియా న్యూస్ లు అన్ని మాములుగా లేవు.
ఇక హిందీ మీడియాలో రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీపై తీవ్ర విమర్శలు చేసారు. అల్లు అర్జున్ సినిమా తీసాడు, బిజినెస్ చేసుకున్నాడు, పైసల్ సంపాదించాడు అంటూ రేవంత్ మాటలు బట్టి చూస్తే రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ పై యుద్ధమే చేస్తున్నాడనిపిస్తుంది.
ఇక ఇప్పుడు బాలయ్య ఇంటి గోడను కూలదోస్తారు, రోడ్డు వైడ్ కోసం బాలయ్య ఇంటి గోడకు రేవంత్ ఎసరు అంటూ సోషల్ మీడియాలో వార్తలు కనబడుతున్నాయి. మరి రేవంత్ కి కాంగ్రెస్ కి సినిమా ఇండస్ట్రీపై ఎందుకంత కక్ష.
గత ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీతో తత్సంబందాలే మైంటైన్ చేసింది. డ్రగ్స్ కేసుల్లో హీరోలు, పెద్దల పేర్లు వినిపించినా ఎక్కడా అరెస్ట్ ల డ్రామాలు చెయ్యలేదు, కానీ రేవంత్ ప్రభుత్వం అలా కాదు.. చేసి చూపించేస్తుంది. మరి ఇది ఎక్కడివరకు దారి తీస్తుందో చూడాలి.