సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో ఏ11 నిందితుడిగా భావిస్తూ టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో చంచల్ గూడ జైలులో ఒకరోజు గడిపి బయటికి రావాల్సి వచ్చింది. ఆయన అరెస్ట్ మొదలుకుని రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చే వరకూ ఎక్కడ చూసినా.. ఎవరినోట విన్నా అల్లు అర్జున్ అరెస్ట్ మాటే వినిపించింది.. కనిపించింది. ఇప్పుడిక బన్నీ ఇంటికి సెలబ్రిటీల తాకిడితో ఉంది. నటీ నటులు, నిర్మాతలు, దర్శకులు, జూనియర్ ఆర్టిస్టులు, అభిమానులు, రాజకీయ నాయకులు, పలువురు వ్యాపారవేత్తలు సైతం వచ్చి కలుస్తున్నారు.
ఏమేం మాట్లాడారు..?
ఇక రిలీజ్ తరవాత నేరుగా గీత ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లిన బన్నీ తన లీగల్ టీమ్.. ముఖ్యంగా తన తరపున వాదనలు వినిపించి, బెయిల్ వచ్చేలా చేయడానికి కారకుడైన ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను కౌగిలించుకొని.. కాస్త ఎమోషనల్ అయ్యాడు బన్నీ. ఒక రెండు మూడు నిమిషాలు పాటు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిన బన్నీ తర్వాత సుమారు 45 నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. పోలీసులు ఏమైనా తప్పుగా ప్రవర్తించారా..? బెయిల్ వచ్చినా రిలీజ్ చేయకుండా ఉన్న పోలీసుల తీరుపై మళ్ళీ కోర్టును ఆశ్రయించాలా..? ఇలా అన్ని విషయాలపై మాట్లాడారు. కాసేపు జోకులు వేసుకుంటూ కూడా మాట్లాడుకోవడం జరిగిందట.
వైసీపీకి ఏం సంబంధం..?
నిరంజన్ రెడ్డి.. వైసీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనిషి. తన అక్రమాస్తుల కేసులు మొదలుకుని, వైసీపీతో పాటు వైఎస్ ఫ్యామిలీకి సమందించి లీగల్ వ్యవహారాలు అన్నీ నిరంజన్ చూసుకున్నారు.. ఇంకా చూస్తూ ఉన్నారు కూడా. అందుకే ఆయనకు నమ్మకస్తుడిగా ఉందటంతో రాజ్యసభ సీటు ఇచ్చి ఎంపీగా పెద్దల సభకు పంపారు జగన్. ఎంపీ అయినప్పటికీ తన వృత్తి ధర్మం పాటిస్తూ ఇలా కేసులు వాదిస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కేసు కూడా హై ప్రొఫైల్ కావడంతో వాదించారు. గంటకు కోటికి పైగానే చార్జి చేశారని చెప్పుకుంటున్న పరిస్థితి. ఆయన వైసీపీ ఎంపీతో పాటు న్యాయవాది కావడంతో ఇలా తన క్లయింట్ తో భేటీ అయ్యారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదు.