నిన్న శుక్రవారం సాయంత్రం నుంచి మోహన్ బాబు బెయిల్ రిజెక్ట్ అయ్యింది. మోహన్ బాబు ను ఏ క్షణాన అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటూ ప్రచారం మొదలైన కొద్ధిసమయానికే మోహన్ బాబు పరారీలో ఉన్నారు, ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారనే వార్త విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది.
అయితే ఈ రూమార్స్ పై మంచు మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు.
తప్పుడు ప్రచారం చేస్తున్నారు.! ముందస్తు బెయిల్ తిరస్కరించబడలేదు, ప్రస్తుతం నేను మా ఇంట్లో వైద్యుల సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలను బయటపెట్టాలని మీడియాను కోరుతున్నాను.. అంటూ ట్వీట్ చేసారు.