పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయ్యి ఒక నైట్ జైలులో ఉన్న అల్లు అర్జున్ ఈరోజు ఉదయమే రిలీజ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్ జైలు నుంచి ఇంటికి రాగానే ఆయన్ని పరామర్శించేందుకు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటున్నారు.
ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాక నిన్ననే వాళ్ళ ఇంటికి వెళ్లిన సుకుమార్.. ఈరోజు ఉదయమే అల్లు అర్జున్ ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యేలోపులో మళ్ళీ అల్లు అర్జున్ ని కలిసేందుకు వచ్చారు. అల్లు అర్జున్ ని చూడగానే సుకుమార్ ఎమోషనల్ అయ్యారు.
కన్నీళ్ళు తుడుచుకున్న ఆయన్ను అల్లు అర్జున్ హత్తుకుని ఓదార్చిన వీడియోస్ వైరలయ్యాయి.