తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోన్న టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో ఇవాళ ఉదయం నుంచి అన్నీ ట్విస్టులే చోటు చేసుకుంటున్నాయి. ఐతే సాయంత్రం నాలుగు గంటల తర్వాత మరో ఊహించని ట్విస్ట్ జరిగింది. ఇందుకు కారణం పుష్ప 2 ప్రీమియర్ షోలో మృతి చెందిన రేవతి భర్త భాస్కర్. తొక్కిసలాటకు, తన భార్య మరణానికి అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం గమనార్హం. అంతే అల్లు అర్జున్ అరెస్టు చేసిన విషయం టీవీలో, ఫోన్లో చూసి తెలుసుకున్నట్లు మీడియాకు వివరించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉంటున్నా అని.. అవసరం అయితే ఈ కేసును విత్ డ్రా (ఉపసుహరించుకుంటా) అని మీడియాకు వివరించారు.
ఏం జరగొచ్చు..?
కంప్లయింట్ ఇచ్చిన వాళ్ళు విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ అదే కేసు అయినా, ఎఫ్ఐఆర్ అయ్యాక కచ్చితంగా మేజిస్ట్రేట్ ఒప్పుకోవాలి. లేకుంటే వీలుకాదు. ఇక్కడ అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు కాబట్టి మేజిస్ట్రేట్ ఒప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ కేసులో బాధితుడు, ఫిర్యాదు చేసిన వ్యక్తి ఒక్కరే కావడంతో ఇది మరింత తేలిక అవుతుంది. దీంతో అల్లు అర్జున్ సులువుగా బయటికి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
నడుస్తున్న చర్చలు..!
ఈ కేసు విత్ డ్రా వ్యవహారంపై న్యాయ నిపుణులతో నిర్మాత, అల్లు అర్జున్ అత్యంత ఆప్తుడు బన్నీ వాసు చూస్తున్నారని తెలిసింది. ఇప్పటి వరకూ చనిపోయిన రేవతి భర్త కేసు వెనక్కి తీసుకోవచ్చా? ఎలా తీసుకోవచ్చు..? అనే దానిపై అని చర్చలు నడుస్తున్నాయి. ఇవాళ రాత్రికల్లా కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అల్లు అర్జున్ అభిమానులకు ఇది కాస్త ఊరట కలిగించే విషయమే అని చెప్పుకోవచ్చు.