మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకుని ఆయన హుటాహుటిన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి బయలు దేరినట్లుగా తెలుస్తుంది. మేనల్లుడు అల్లు అర్జున్ కి మద్దతుగా మెగాస్టార్ చిరు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి రానున్నట్లుగా సమాచారం. ఈరోజు ఉదయం అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు ఆయన ఇంటివద్దనే అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ కి వైద్యపరీక్షలు పూర్తి చెయ్యడానికి ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తి కాగానే అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటికే హై కోర్టులో అల్లు అర్జున్ లాయర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు.
అల్లు అర్జున్ కోసం చిరు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని రాబోతున్నారు, మరోపక్క నిర్మాత దిల్ రాజు ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చారు, అల్లు అరవింద్, అల్లు శిరీష్, అల్లు అర్జున్ మామగారు అందరూ అల్లు అర్జున్ కోసం పోలీస్ స్టేషన్ కి చేరుకున్నవారిలో ఉన్నారు.