నితిన్ రాబిన్ హుడ్ క్రిస్టమస్ కి రావడం లేదా? అందుకే నితిన్ తన చిత్రాన్ని ప్రమోట్ చెయ్యడం లేదా? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న వార్తలు. వెంకీ కుడుములు-నితిన్ కాంబోలో రాబోతున్న రాబిన్ హుడ్ పై మంచి అంచనాలున్నాయి. అందులోను క్రిస్టమస్ రిలీజ్ అంటూ మంచి డేట్ లాక్ చేసారు.
కానీ ఇప్పుడు నితిన్ రాబిన్ హుడ్ క్రిస్టమస్ కి రావడం లేదు, రాబిన్ హుడ్ పోస్ట్ పోన్ అయ్యింది అంటూ వస్తున్న వార్తలకు మేకర్స్ స్పందించకపోవడం పై రాబిన్ హుడ్ వాయిదా తప్పదని అందరూ ఫిక్స్ అవగా.. ఇప్పుడు నితిన్ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. అది రాబిన్ హుడ్ ని సంక్రాంతికి విడుదల అంటున్నాడట.
మరి సంక్రాంతికి గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్, డాకు మహారాజ్ అంటూ బాలకృష్ణ గట్టిపోటీ ఇస్తుంటే.. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అంటూ కూల్ గా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. మరి ఈ మూడు క్రేజీ సినిమాలతో పాటుగా ఇప్పుడు రాబిన్ హుడ్ కూడా సంక్రాంతి రేస్ లో జాయిన్ అవడంపై ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతున్నారు.