Advertisementt

మంచు మనోజ్ దే తప్పా..

Fri 13th Dec 2024 12:07 PM
manchu family  మంచు మనోజ్ దే తప్పా..
Manchu Manoj is wrong.. మంచు మనోజ్ దే తప్పా..
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ లో మంచు వారి ఆస్తి తుఫాను హాట్ టాపిక్ గా నడుస్తుంది. మోహన్ బాబు తన చిన్నకొడుకు విషయంలో తప్పు చేసారా?లేదంటే మనోజ్ ది తప్పా అనేది క్లారిటీ లేకపోయినా ముందు నుంచి మోహన్ బాబు ఈ విషయంలో నలిగిపోతున్నారని మీడియా సింపతీ చూపించినా.. తర్వాత మోహన్ బాబు మీడియాపై చేయి చేసుకోవడంతో ఆయనకు మీడియా యాంటీ అయ్యింది. 

అక్కడినుంచి మంచు మనోజ్ పై సింపతీ స్టార్ట్ అయ్యింది. అయితే మోహన్ బాబు మీడియా జర్నలిస్ట్ పై చేయి చేసుకోకముందు.. మంచు మనోజ్ తన ఇంట్లో బిహేవ్ చేసిన వీడియో చూసాక అందరూ మంచు మనోజ్ తప్పు చేశాడా అనేలా ఫీలవుతున్నారు. మోహన్ బాబు అలాగే ఇంకొంతమంది అక్కడ ఉండగా మనోజ్ వారిపై కేకలు వేస్తున్న వీడియో అది. మోహన్ బాబు నచ్చజెప్పుతున్నప్పటికీ వినిపించుకోకుండా ముందుకు దూసుకెళ్లడం ఇందులో రికార్డయింది.

ఎవరో ఓ పెద్దాయనని పట్టుకుని మనోజ్ నువ్వెవడివిరా మాఇంటి కొచ్చి నాకు చెబుతున్నావ్, మా గొడవ కు నీకు సంబంధం ఏమిటి అంటూ గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. మోహన్ బాబు సహా పక్కన ఉన్న వాళ్లు వెనక్కి లాగుతున్నప్పటికీ తూలుతూ ముందుకు వెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు. 

ఈ వీడియో చూశాక చాలామంది ఈ గొడవలో మోహన్ బాబు మంచు మనోజ్ బిహేవియర్ గురించి చెప్పిందే నిజమనుకునేలా ఉండడంతో మనోజ్ దే తప్పా అంటూ నెటిజెన్స్ మాట్లాడుకోవడం హైలెట్ అయ్యింది.. 

Manchu Manoj is wrong..:

Manchu Family Feud - Latest Updates

Tags:   MANCHU FAMILY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ